Syria: సిరియా సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు..! 4 d ago
సిరియాను తిరుగుబాటుదారులు ఆక్రమించడంతో ఆ దేశం రాజకీయ సంక్షోభంలో విలవిలలాడుతోంది. ఈ నేపథ్యంలో ఆ దేశంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. ఇటీవల సిరియా సైనిక స్థావరాలే లక్ష్యంగా టెల్అవీవ్ దాడులు చేసింది. దక్షిణ అలెప్పోలో భారీగా బాంబు పేలుళ్లు వినిపించాయని స్థానికులు తెలిపారు. రక్షణ, పరిశోధన స్థావరాలు లక్ష్యంగా దాడులు చేసిందని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ వెల్లడించింది.